SACHIVALAYAM: ఇలా వదిలేస్తే ఎలా..?
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:11 AM
వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలని సచివాలయాలు ఏర్పాటు చేసి, భవన నిర్మాణాల విషయంలో వాటిని పూర్తి చేయాలేక ప్రజాధనం దుర్వినియోగం అయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కొన్ని మొండి గోడలకే పరిమితం..
రూ.లక్షల ప్రజాధనం వృథా
గోరంట్ల, ఆగస్టు25(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలని సచివాలయాలు ఏర్పాటు చేసి, భవన నిర్మాణాల విషయంలో వాటిని పూర్తి చేయాలేక ప్రజాధనం దుర్వినియోగం అయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రూ.45 లక్షల వ్యయంతో సచివాలయ భవనం నిర్మాణ పనులు ప్రారంభించగా, పక్కనే రైతు భరోసా కేంద్రం, హెల్త్‌క్లినిక్‌కు ప్రత్యేక భవనాలు నిర్మించతలపెట్టారు. మండలంలో 20 సచివాలయాలుండగా, గతంలో మందలపల్లి-1, బూదిలి సచివాలయాల నిర్మాణాలు పూర్తిచేసి ప్రారంభించారు. మిగిలిన వాటిలో మల్లాపల్లి, గోరంట్ల, 2, 3, 4, సచివాలయ భవనాలు పూర్తి అయినా, ప్రారంభించకపోవడంతో కంపచెట్లు పెరిగి వృథాగా పడి ఉన్నాయి. భవనాలు వినియోగించకపోవడంతో అందులోని సామగ్రి శిథిలావస్థ చేరింది. ఇందులోని సంత మార్కెట్, శివాలయం, సచివాలయాలను కుట్టు శిక్షణ కోసం వినియోగిస్తున్నారు. మిగిలిన వాటిలో 12 సచివాలయాకు రెండో స్లాబ్ వేసి అర్ధాంతరంగా పనులు ఆపివేశారు. గోరంట్ల-5 సచివాలయం, ఎమ్మార్సీ వద్దగల ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో నిర్మిస్తున్నారని, కోర్టు అభ్యంతరంతో కాంట్రాక్టర్ పనులు ఆపివేశారు. గంగంపల్లిలోనూ గ్రౌండ్‌స్లాబ్ పూర్తి చేసి వదిలేశారు. ఇక్కడున్న హెల్త్ సబ్ సెంట్ పాతభవనం తొలగించి నూతన భవనం నిర్మించాలని చేపట్టిన పనులు మొండిగోడలతో దర్శనమిస్తూన్నాయి. పాత భవనం ఉన్నా ప్రజలకు ఉపయోగపడటం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రస్తుతం మల్లాపల్లిలోని గోకుల ఆశ్రమంలో సచివాలయం నిర్వహిస్తున్నారు. అలాగే గోరంట్ల పంచాయతీలో 5 సచివాలయాలుండగా, పట్టుపరిశ్రమ శాఖ షెడ్‌లో 1, 3 సచివాలయాలు, మిగిలినవి గ్రామ చావిడితోనూ, వ్యవసాయ శాఖ పాత గిడ్డంగి, సంత మార్కెట్ నూతన ఆర్‌ఎ్‌సకే భవనంలో నిర్వహించాల్సి వస్తోంది. మేజర్ పంచాయతీ అయినా సొంత భవనం లేక ఇబ్బందిపడుతున్నారు. మల్లాపల్లి సచివాలయ భవన నిర్మాణాలను గ్రావ
ూనికి 2.5 కిలోమీటర్ల దూరంలో గుమ్మయ్యగారిపల్లి వద్ద ఏర్పాటు చేయడంతో పంచాయతీ ప్రజలే తీవ్రంగా వ్యతిరేకిస్తూన్నారు.
మైనర్ పనులు జరగాలి
మల్లాపల్లి సచివాలయ భవనాలకు నీటి సౌకర్యం, ప్లంబిక్ వర్కర్, ఎలెకి్ట్రక్, శానిటేషన పనులు పూర్తి చేయాలి. గోరంట్లలోని 2, 3, 4 సచివాలయాల్లో చిన్న చిన్న పనలుఉ చేయాల్సి ఉంది. మిగిలిన గ్రామాల్లోని 14 సచివాలయాల్లో సగం పనులు జరగగా, మిగిలిన సగం నిర్మాణం జరగాల్సి ఉంది. పాఠశాల ఆవరణలో ఉందని, ఒకటి పెండింగ్‌లో ఉందని, మిగిలినవి పనులు పూర్తిచేయడానికి చర్యలుచేపడుతున్నాం.
-వరప్రసాద్, ఏఈ, పంచాయతీరాజ్