Share News

How సదువులు సాగేదెలా..?

ABN , Publish Date - Jun 24 , 2025 | 12:13 AM

గత వైసీపీ ప్రభుత్వం నాడు - నేడు పథకం పే రుతో ఉన్న సమస్యలు పరిష్కరించడం అటుంచి .. కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది.

How సదువులు సాగేదెలా..?
వేపరాలలో అసంపూర్తి భవనంలో చదువుకొంటున్న విద్యార్థులు

రాయదుర్గంరూరల్‌, జూన 23(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం నాడు - నేడు పథకం పే రుతో ఉన్న సమస్యలు పరిష్కరించడం అటుంచి .. కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పాత తరగతి గదులను కూ ల్చి వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మించడానికి శ్రీకారం చుట్టింది. అయితే కూల్చడంపై చూపిన శ్రద్ధను ... వాటిని నిర్మించడంపై చూపలేదు. దీంతో ఉన్న తరగతి గదులు పోయి.. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని టీ వీరాపురం పాఠశాలకు ఐదు గదు లు, కొండాపురానికి మూడు గదులు, వేపరాలకు నాలుగు, క దరంపల్లికి మూడు, ఉడేగోళంకు మూడు, వడ్రహోన్నూరుకు మూడు అదనపు త రగతి గదులను కేటాయించింది. వీటి నిర్మాణాల కోసం ఆ యా పాఠశాలల్లో ఉన్న తరగతి గదులను కూ ల్చివేసి.. నిర్మాణాలు చేపట్టింది. అయితే నిధులు మంజూరు చేయకపోవడంతో ఆ నిర్మాణాలు నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులకు ఆ అసంపూర్తిగా ఉన్న భవనాల్లో.. వరండాలో .. చెట్ల కింద.. ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారు.

Updated Date - Jun 24 , 2025 | 12:13 AM