Share News

CPI అర్హులకు ఇంటిస్థలాలు ఇవ్వాలి: సీపీఐ

ABN , Publish Date - Jun 04 , 2025 | 12:16 AM

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్లను నిర్మించి ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ డిమాండ్‌ చేశారు.

CPI  అర్హులకు ఇంటిస్థలాలు ఇవ్వాలి: సీపీఐ
ధర్నాలో మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌

గుత్తి, జూన 3(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్లను నిర్మించి ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో స్థానిక సీపీఐ కార్యాలయం నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు నాయకులు, పేదలు ర్యాలీ నిర్వహించి.. అక్కడ ధర్నా చేపట్టారు. అనంతరం కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌ లక్ష్మీనాయక్‌కు వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి, మండల కార్యదర్శి రామదాసు, పట్టణ కార్యదర్శి రాజు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 12:16 AM