House అర్హులకు ఇంటి పట్టాలివ్వాలి
ABN , Publish Date - Apr 25 , 2025 | 11:38 PM
మండలంలో అర్హులకు ఇంటిపట్టాలివ్వాలని తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఎం నాయకులు శుక్రవారం నిరసన తెలిపారు.
ఓబుళదేవరచెరువు, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి) : మండలంలో అర్హులకు ఇంటిపట్టాలివ్వాలని తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఎం నాయకులు శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ, వివి రమణ మాట్లాడుతూ.. గతంలో వైసీపీ ప్రభుత్వం పేదలకు అరకొరగా ఇళ్లస్థలాలను మంజూరు చేసిందని, ఆ పట్టాలు కూడా అర్హులకు అందలేదని ఆరోపించారు. నూతన ప్రభుత్వమైనా స్పందించాలన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కుళ్లాయప్ప, నాయకులు ఆంజి, శేఖర్, వెంకటేష్, సాయిలీలా పాల్గొన్నారు.