Hostel seats హాస్టల్ సీట్లు పెంచాలి
ABN , Publish Date - Jun 24 , 2025 | 11:33 PM
స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల బీసీ హాస్టల్‌లో అదనపు గదులు నిర్మించి.. దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థినికి చోటు కల్పించాలని ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు డిమాండ్ చేశారు.
గుత్తి, జూన 24(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల బీసీ హాస్టల్‌లో అదనపు గదులు నిర్మించి.. దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థినికి చోటు కల్పించాలని ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం బీసీ వెల్ఫెర్ కళాశాల హాస్టల్ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ హాస్టల్‌కు గుంతకల్లు, ఉరవకొండ, విడపనకల్లు, ప్యాపిలి, పత్తికొండ తదితర మండలాల నుంచి విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. హాస్టల్‌లో సీట్లు లేవని వార్డెన చెప్పడంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని, వారు చదువుకు దూరమయ్యే ప్రమాదముందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్, పట్టణ అఽధ్యక్ష, కార్యదర్శులు బాలాజీ, ధనుంజయ పాల్గొన్నారు