Share News

ఎనసీసీ క్యాడెట్‌కు సన్మానం

ABN , Publish Date - Sep 19 , 2025 | 12:18 AM

స్థానిక కేటీఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ భౌతికశాస్త్రం ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎనసీసీ క్యాడెట్‌ ఆసియాభాను ఆల్‌ ఇండియా తలసైనిక్‌ క్యాంపుకు ఎంపికై ఢిలీల్లో శిక్షణ పూర్తి చేసింది.

ఎనసీసీ క్యాడెట్‌కు సన్మానం
ఆసియాభాను, తల్లిదండ్రులను సన్మానిస్తున్న సిబ్బంది

రాయదుర్గంరూరల్‌, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): స్థానిక కేటీఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ భౌతికశాస్త్రం ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎనసీసీ క్యాడెట్‌ ఆసియాభాను ఆల్‌ ఇండియా తలసైనిక్‌ క్యాంపుకు ఎంపికై ఢిలీల్లో శిక్షణ పూర్తి చేసింది. ఈ సందర్భంగా కళాశాలలో ఆసియాభాను, ఆమె తల్లిదండ్రులను గురువారం ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపాల్‌ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఎనసీసీ స్థాపించిన అతి కొద్ది కాలంలోనే ఢిల్లీస్థాయికి ఆసియాభాను సెలెక్ట్‌ కావడం గొప్ప విషయమన్నారు. ఆమె ఢిల్లీకి పంపడానికి ఆమె తల్లిదండ్రులు చేసిన కృషి, సహాయ సహకారాలు అందరికీ ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది అస్లాం, ఎనసీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2025 | 12:18 AM