Share News

చెరువులకు హెచ్చెల్సీ నీరు : టీడీపీ

ABN , Publish Date - Dec 30 , 2025 | 11:51 PM

మండలంలోని పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి చెరువులను హెచ్చెల్సీ నీటితో కచ్చితంగా నింపుతామని టీడీపీ నాయకులు చవ్వా కులశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు

చెరువులకు హెచ్చెల్సీ నీరు : టీడీపీ
మాట్లాడుతున్న టీడీపీ నాయకుడు కులశేఖర్‌రెడ్డి

పుట్లూరు, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): మండలంలోని పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి చెరువులను హెచ్చెల్సీ నీటితో కచ్చితంగా నింపుతామని టీడీపీ నాయకులు చవ్వా కులశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన మీడియా తో మాట్లాడారు. చెరువులకు నీరు రావని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, వాటిని రైతులు నమ్మరాదని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ఏడాది హెచ్చెల్సీ నీరు ఆలస్యమైందన్నారు. ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ నిరంతరం నీరు తెచ్చేందుకు కృషిచేస్తున్నారన్నారు. సోమవారం తుంపెర డిప్‌కట్‌ వద్ద కొందరు కాలువ తెంచివేసి నీటిని మళ్లించారన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే.. కలెక్టర్‌, హెచ్చెల్సీ అధికారులతో మాట్లాడి సుబ్బరాయసాగర్‌కు వచ్చేలా చేశారన్నారు. కచ్చితంగా మూడు చెరువులకు నీరు నింపుతామని తెలిపారు. సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2025 | 11:51 PM