అధిక యూరియాతో అనర్థం
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:27 PM
పంటలకు యూరియాను అధికంగా వడటం వల్ల కలిగే అనర్థాలపై వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ పథక సంచాలకులు బీ పద్మలత మండలంలోని ఆవులదట్ల, రేకులకుంట గ్రామాల్లో రైతులకు గురువారం అవగాహన కల్పించారు.
రాయదుర్గంరూరల్, సెప్టెంబరు 11(ఆంధ్రజోతి): పంటలకు యూరియాను అధికంగా వడటం వల్ల కలిగే అనర్థాలపై వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ పథక సంచాలకులు బీ పద్మలత మండలంలోని ఆవులదట్ల, రేకులకుంట గ్రామాల్లో రైతులకు గురువారం అవగాహన కల్పించారు. మోతాదుకు మించి యూరియా వాడటం వల్ల చీడపీడలు అధికమవుతాయని, నేలలో పోషణ విలువలు తగ్గుతాయని, కాండం పెలుసుగా మారి గాలికి పంటకు కూలుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి లక్ష్మీనరసింహులు, రుమానబేగం, రైతు సేవా సహాయకులు రైతులు పాల్గొన్నారు.