ఉద్యాన పంటలతో అధిక లాభాలు
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:00 AM
రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుతో అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన మాజీ మంత్రి దేవినేని ఉమ, ప్రభు త్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు.
గుమ్మఘట్ట, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుతో అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన మాజీ మంత్రి దేవినేని ఉమ, ప్రభు త్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. వారు మండలంలోని బీటీపీ ప్రాజెక్టును ఆదివారం పరిశీలించారు. అనంతరం రైతులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. రైతులు హార్టిలక్చర్ పంటలను సాగుచేసి దేశ, విదేశాలకు ఎగుమతి చేసి అధిక లాభాలు సాధించేదానిపై దృష్టి పెట్టాలన్నారు. ఇందుకు తగిన సలహాలు, సూచనలు పొందేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. మూడేళ్లలలో హంద్రీనీవా జలాలతో బీటీపీ రిజర్వాయర్‌ను నింపి ఇక్కడి రైతులకు శాశ్వతంగా నీటి సమస్యను తొలగిస్తామన్నారు. అనంతపురంలో బుధవారం నిర్వహించే సీఎం చంద్రబాబు సభకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గిరిమల్లప్ప, క్లస్టర్ ఇనచార్జి కాలవ సన్నన్న, మార్కెట్‌యార్డు వైస్ ఛైర్మన దానవేంద్ర, బీటీపీ ప్రాజెక్టు ఛైర్మెన కాలవ రాజు, టీడీపీ యువనాయకులు రమేష్, సంజీవ, నీరగంటి తిమ్మప్ప, ఉస్మాన పాల్గొన్నారు.