Share News

ఉద్యాన పంటలతో అధిక ఆదాయం

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:53 AM

జిల్లా ఉద్యాన పంటలకు అనుకూలమని, ఆ పంటలను సాగు చేస్తే అధిక ఆదాయం పొందవచ్చని కలెక్టర్‌ ఆనంద్‌ రైతులకు సూచించారు.

 ఉద్యాన పంటలతో అధిక ఆదాయం
కణేకల్లు: చెక్కు అందజేస్తున్న విప్‌ కాలవ శ్రీనివాసులు

ఉరవకొండ, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లా ఉద్యాన పంటలకు అనుకూలమని, ఆ పంటలను సాగు చేస్తే అధిక ఆదాయం పొందవచ్చని కలెక్టర్‌ ఆనంద్‌ రైతులకు సూచించారు. స్థానిక మండల పరిషత కార్యాలయం ఆవరణంలో బుధవారం నిర్వహించిన అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన కార్యక్రమంలో కలెక్టర్‌ రైతులకు చెక్‌ను పంపిణీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ... అరటి ఎగుమతులకు సంబంధించి వ్యాపారులు, ఎగుమతుదారులతో ధరల నియంత్రణపై సమీక్షించామని, రైతులు పెట్టిన పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. జేడీఏ ఉమామహేశ్వరమ్మ మాట్లాడుతూ... జిల్లాలో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన పథకం కింద రెండో విడతలో 46,85,838 మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,135.01 కోట్లు జమ చేశామన్నారు. కార్యక్రమంలో ఏడీ లక్ష్మానాయక్‌, ఏడీఏ సత్యనారాయణ, ఏఓ రామకృష్ణ, ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్‌ దేవినేని పురుషోత్తం పాల్గొన్నారు.

కణేకల్లు : స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు అన్నదాత సుఖీభవ చెక్కులను రైతులకు అందజేశారు. రాయదుర్గం నియోజకవర్గంలో దాదాపు 38,500 మంది రైతులకు రూ.29 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ జగదీష్‌, డీటీ విశ్వనాథ్‌, టీడీపీ నాయకులు హనుమంతరెడ్డి, వన్నారెడ్డి, లాలెప్ప, ఆనంద్‌రాజ్‌, షేక్‌ఫకృద్ధీన, సుదర్శన, బీటీ రమేష్‌, చంద్రశేఖర్‌గుప్తా పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 12:53 AM