భారీ వర్షం.. ఇళ్లలోకి నీరు
ABN , Publish Date - Aug 06 , 2025 | 01:36 AM
మండల వ్యాప్తంగా మంగళవారం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లేపాక్షిలోని నంది వెనుకాల బొమ్మలాటల ఇళ్లలోకి భారీ వరదనీరు చేరింది. దీంతో ఇళ్లలోని వస్తువులన్నీ తడిసి ముదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
లేపాక్షి, పరిగి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా మంగళవారం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లేపాక్షిలోని నంది వెనుకాల బొమ్మలాటల ఇళ్లలోకి భారీ వరదనీరు చేరింది. దీంతో ఇళ్లలోని వస్తువులన్నీ తడిసి ముదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లవద్ద సరైన రోడ్లు, డ్రైనేజీలు లేకపోవడంతో వర్షాకాలం మొత్తం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. పలుమార్లు రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లినా లాభంలేకుండాపోయిందన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు డ్రైనేజీలు ఏర్పాటుచేసి వరదనీటి నుంచి తమకు విముక్తి కలిగించాలని కోరుతున్నారు.
పరిగి మండల కేంద్రంలోని గొల్లపల్లి గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లలోనీరు ప్రవహించాయి. డ్రైనేజీ సమస్య ఉండటంతో వర్షం, మురుగునీరు ఇళ్లల్లోకి వస్తోందని స్థానికులు అంటున్నారు. పారిశుధ్య కార్మికులు డ్రైనేజీని శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
పావగడ: పట్టణ వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం వర్షం కురిసింది. దీంతో పట్టణవాసులు, రైతులు హర్షం వ్యక్తంచేశారు.