రైతులకు వాన గుబులు
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:11 AM
మండలంలోని రెండురోజులుగా తుపాన ప్రభావంతో వర్షాలు పడుతుండటంతో పంట లు దెబ్బతినే అవకాశముందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు
బొమ్మనహాళ్, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని రెండురోజులుగా తుపాన ప్రభావంతో వర్షాలు పడుతుండటంతో పంట లు దెబ్బతినే అవకాశముందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వరి పంటపై పెద్దగా ప్రభవం లేకపోయినా.. మొక్కజొన్న, బంతిపూలు, మిరప పంటలు సాగు చేసిన రైతులు ఆందోళనలో ఉన్నారు. పొలాలు నీట మునిగిపోయి మొక్కలు కుళ్లిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం తగ్గిన వెంటనే పొలాల్లో నీరు బయటకు తరలించేలా రైతులు చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారి సాయికుమార్ సూచించారు.