జంగంపల్లిలో భారీ వర్షం
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:16 AM
మండలంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది.
యల్లనూరు, సెప్టెంబరు18(ఆంధ్రజ్యోతి): మండలంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. యల్లనూరు, కృష్ణాపురం, జంగంపల్లి, పాతపల్లి, వెన్నపూసపల్లి గ్రామాల్లో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 5గంటల వరకు వానపడింది. దీంతో వాగు లు, వంకలు ప్రవహించాయి. ఈ వర్షానికి జంగంపల్లి గ్రామంలో అంగనవాడీ కేంద్రం చుట్టూ మూడు అడుగుల లోతు నీరు నిలిచింది.