రూ. 7.85 కోట్లతో ఆరోగ్య కేంద్రాలు: విప్
ABN , Publish Date - Nov 04 , 2025 | 01:29 AM
నియోజకవర్గంలో రూ. 7.85 కోట్లతో గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాలను నిర్మిస్తామని, అలాగే ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేస్తామని విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పష్టంచేశారు.
రాయదుర్గం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో రూ. 7.85 కోట్లతో గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాలను నిర్మిస్తామని, అలాగే ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేస్తామని విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పష్టంచేశారు. సోమవారం బీఎన హళ్లి గ్రామంలో గ్రామసచివాలయ భవనాన్ని సోమవారం ప్రారంభించిన ఆయన మాట్లాడారు. వివిధ పద్దుల కింద ఈ పనులను ఏడాది లోపు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కురుబ హనుమంతు, కాటా వెంకటేశులు, మాజీ జడ్పీటీసీ విజయ్‌కుమార్, సోము, వీరేష్ పాల్గొన్నారు.