Share News

ప్రజాసమస్యలపై నిర్లక్ష్యం వల్లే పదవి ఊడింది

ABN , Publish Date - Oct 31 , 2025 | 11:34 PM

మున్సిపల్‌ ఛైర్మనగా ఉండి కూడా తలారి రాజ్‌కుమార్‌ ప్రజాసమస్యలను నిర్లక్ష్యం చేశారని, దా ని ఫలితంగానే పదవి పోయిందని, ఇందులో రాజకీయాలు ఏమీ లేవ ని.. టీడీపీ పట్టణ అధ్యక్షుడు సర్మస్‌వలీ స్పష్టం చేశారు.

ప్రజాసమస్యలపై నిర్లక్ష్యం వల్లే పదవి ఊడింది
మాట్లాడుతున్న టీడీపీ పట్టణ అధ్యక్షుడు సర్మస్‌వలీ

కళ్యాణదుర్గం, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఛైర్మనగా ఉండి కూడా తలారి రాజ్‌కుమార్‌ ప్రజాసమస్యలను నిర్లక్ష్యం చేశారని, దా ని ఫలితంగానే పదవి పోయిందని, ఇందులో రాజకీయాలు ఏమీ లేవ ని.. టీడీపీ పట్టణ అధ్యక్షుడు సర్మస్‌వలీ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘14 నెలలుగా ప్రజాసమస్యలను గాలికి వదిలేశారు. ఏ రోజూ మున్సిపల్‌ కార్యాలయానికి రాలేదు. పలుమార్లు మున్సిపల్‌ కార్యాలయ సిబ్బంది కౌన్సిల్‌ సమావేశం నిర్వహించడానికి రిజిస్టర్‌ పోస్టులు పంపించినా వాటికి స్పందించకుండా మొద్దు నిద్రలో ఉండిపోయారు. పట్టణంలో ప్రజలు తాగునీరు, డ్రైనేజీ తదితర అనేక సమస్యతో ఇబ్బందులు పడుతున్నా.. ఏ మాత్రం పట్టించుకోలేదు. సమస్యల పరిష్కారం కోసం కౌన్సిల్‌ సమావేశం నిర్వహించడానికి కౌన్సిలర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ ఆహ్వానించినా ఒక్కసారి కూడా కౌన్సిల్‌ సమావేశానికి రాకుండా.. అభివృద్ధిని అడ్డుకున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించే ఎమ్మెల్యే దొరకడం అదృష్టం. కాని మీరు ఆ అభివృద్ధిని అడ్డుకునేలా ప్రవర్తించారు. మీరు చేసిన నిర్లక్ష్యం.. చేసిన తప్పిదాల వల్లే మీ పదవి పోయిందే తప్పా..ఇందులో రాజకీయాలు ఏమీ లేవు.’ అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2025 | 11:34 PM