Share News

Have mercy కరుణించవా.. వరుణదేవా..!

ABN , Publish Date - Jun 11 , 2025 | 12:18 AM

ఖరీ్‌ఫలో భా గంగా ముందస్తుగా పత్తి విత్తనం నాటిన రైతు లు వర్షం కోసం నిరీక్షిస్తున్నారు. మండలంలోని వీరారెడ్డిపల్లి, తిరుణాంపల్లి, చిక్కేపల్లి, కమలపాడు, కుందనకోట, గుడిపాడు గ్రామాల్లో సుమారు 1500 ఎకరాల్లో ముందస్తుగా పత్తివిత్తనం నాటారు.

Have mercy కరుణించవా.. వరుణదేవా..!
తిరుణాంపల్లి వద్ద వాడుతున్న పత్తి మొలకలు

యాడికి, జూన10(ఆంధ్రజ్యోతి): ఖరీ్‌ఫలో భా గంగా ముందస్తుగా పత్తి విత్తనం నాటిన రైతు లు వర్షం కోసం నిరీక్షిస్తున్నారు. మండలంలోని వీరారెడ్డిపల్లి, తిరుణాంపల్లి, చిక్కేపల్లి, కమలపాడు, కుందనకోట, గుడిపాడు గ్రామాల్లో సుమారు 1500 ఎకరాల్లో ముందస్తుగా పత్తివిత్తనం నాటారు. మొలకలు వచ్చాయి. విత్తనం వేసిన తర్వాత నుంచి వర్షాలు పడకపోవడంతో కొంతమంది పొలాల్లో విత్తనం మొలకెత్తనేలేదు. మరికొందరు రైతుల పొలాల్లో మొలకెత్తిన మొ లకలు సైతం వాడుతున్నాయి. దీంతో రైతులు వర్షం కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. సాగుచేసిన పత్తి విత్తనం మొలకెత్తని రైతులు.. పొలాన్ని దున్నేసి.. వర్షంపడితే మరలా విత్తనం సాగు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ముందస్తు పత్తిసాగు రైతుల పరిస్థితిపై మండల వ్యవసాయశాఖ అధికారి మహబూబ్‌బాషాను ఆరాతీయగా జూన 15 తర్వాత పత్తిసాగుకు అనుకూలమని తెలిపారు. ముందస్తు వర్షాలతో కొంతమంది రైతులు పత్తివిత్తనం వేశారని, దీంతో ఇప్పటికే కొద్దిమంది రైతులు నష్టపోయారని అన్నారు. కాగా, ప్రతిరోజూ ఆకాశం మేఘావృతం అవుతుండడం.. మేఘాలు ఊరిస్తుండటంతో ఏదో ఒక రోజు వర్షం పడకపోతుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు.

Updated Date - Jun 11 , 2025 | 12:18 AM