నేమకల్లుకు బస్సు వచ్చిందోచ
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:53 PM
మండలంలోని నేమకల్లు గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్ధరించారు.
బొమ్మనహాళ్, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి) మండలంలోని నేమకల్లు గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్ధరించారు. ఈ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చి.. ఏడాదైనా.. అది అమలు కాలేదు. బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆ గ్రామస్థులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీనిపై ఆంధ్రజ్యోతి సోమవారం ఓ కథనాన్ని ప్రచురించింది. స్పందించిన ఆర్టీసీ రీజనల్ చైర్మన పూల నాగరాజు మంగళవారం నుంచే ఆ గ్రామానికి బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించారు.