3న హనుమద్ వ్రతం
ABN , Publish Date - Nov 25 , 2025 | 01:20 AM
కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో డిసెంబరు మూ డున హనుమద్ వత్రాన్ని నిర్వహిస్తున్నట్లు ఈఓ మేడేపల్లి విజయరాజు తెలిపారు.
గుంతకల్లు టౌన, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో డిసెంబరు మూ డున హనుమద్ వత్రాన్ని నిర్వహిస్తున్నట్లు ఈఓ మేడేపల్లి విజయరాజు తెలిపారు. సోమవారం హనుమాద్ వత్రంపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబరు 2న వివిధ ప్రాంతాల నుం చి వచ్చే హనుమాద్ దీక్షాపరుల ఇరుముడి సమర్పణకు ఎ టువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నా రు. ఈ సమావేశంలో ఆర్డీఓ ఏబీవీబీఎస్ శ్రీనివాస్, ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, డిఎస్పీ శ్రీనివాస్, మున్సిపల్ కమీషనర్ నయీమ్‌ఆహ్మద్, రూరల్ సీఐ ప్రవీణ్‌కుమా ర్, కసాపురం ఎస్‌ఐ టీపీ వెంకటస్వామి పాల్గొన్నారు.