వైభవంగా హనుమద్ వ్రతం
ABN , Publish Date - Dec 04 , 2025 | 12:48 AM
మండలంలోని నేమకల్లులో ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం హనుమద్ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
బొమ్మనహాళ్, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని నేమకల్లులో ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం హనుమద్ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆర్చకులు అనిల్‌కుమార్‌చార్యులు, సంతోషకుమార్‌చార్యులు, పవనచార్యులు అభిషేకం, పవమానహోమం, వ్రతం నిర్వహించారు. స్వామి వారిని తులసి దళాలతో అలంకరించారు. ఇందులో ఆలయ ధర్మకర్త ఎన్టీ శ్రీనాథ్, దేవాదాయశాఖ అధికారి ఓబన్న, కమిటీ సభ్యులు హనుమంతరెడ్డి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.