అలరించిన పంచముఖి హనుమాన
ABN , Publish Date - Aug 06 , 2025 | 02:04 AM
సత్యసాయి యువత చేపట్టిన పంచముఖి హనుమాన డ్యాన్స, డ్రామా భక్తులను అలరించింది. చంఢీఘర్, హరియాణా భక్తులు రెండో రోజు మంగళవారం కూడా సాయికుల్వంతు సభామండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
పుట్టపర్తి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): సత్యసాయి యువత చేపట్టిన పంచముఖి హనుమాన డ్యాన్స, డ్రామా భక్తులను అలరించింది. చంఢీఘర్, హరియాణా భక్తులు రెండో రోజు మంగళవారం కూడా సాయికుల్వంతు సభామండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రాముడి బంటు ఆంజనేయుడి జీవిత చరిత్రపై యువత భక్తిపాటలు, సంగీత నృత్యంతో భక్తులకు ఆహ్లాదం కలిగించారు. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.