జీఎస్టీ తగ్గింపు బోర్డులు ఏర్పాటు చేయాలి : ఎంపీ
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:49 PM
ప్రతి వ్యాపార దుకాణంలో తగ్గిన జీఎస్టీ ధరల బోర్డులు ఏర్పాటు చేయాలని ఎంపీ అంబికా లక్ష్మినారాయణ పేర్కొన్నారు
పామిడి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ప్రతి వ్యాపార దుకాణంలో తగ్గిన జీఎస్టీ ధరల బోర్డులు ఏర్పాటు చేయాలని ఎంపీ అంబికా లక్ష్మినారాయణ పేర్కొన్నారు. స్థానిక ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద మంగళవారం జీఎస్టీ తగ్గింపుపై పీఎం నరేంద్రమోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన ఆయన మాట్లాడారు. జీఎస్టీ తగ్గించి.. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా పీఎం నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్ చౌదరి, గౌస్‌పీరా, అంజినాయక్, కుమారస్వామి, మనోజ్ కుమార్, నరేష్, పవనకుమార్, బొమ్మా మోహనకృష్ణ, జింకల సంజీవకుమార్ పాల్గొన్నారు.