Share News

temple reconstruction ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ

ABN , Publish Date - Apr 30 , 2025 | 11:23 PM

స్థానిక ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ఉన్న పురాతన ఆలయం పాండురంగస్వామి దేవాలయ పునర్నిర్మాణానికి బుధవారం భక్తిశ్రద్ధలతో భూమి పూజను నిర్వహించారు.

temple reconstruction ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ
ధర్మవరం : భూమిపూజ చేస్తున్న హరీ్‌షబాబు

ధర్మవరంరూరల్‌, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ఉన్న పురాతన ఆలయం పాండురంగస్వామి దేవాలయ పునర్నిర్మాణానికి బుధవారం భక్తిశ్రద్ధలతో భూమి పూజను నిర్వహించారు. అతి పురాతనమైన ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. మంత్రి సత్యకుమార్‌ స్పందించి ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.1.20 కోట్లను మం జూరు చేయించారు. దీంతో బుధవారం బీజేపీ నియోజకవర్గ ఇనచార్జి హరీ్‌షబాబు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ నాగరత్నమ్మ, దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ నరసింహరాజు, నూతన కమిటీ మార్కెట్‌ యార్డు చైర్మన అంబటి అరుణశ్రీ, అంబటి సతీష్‌, బీజేపీ నాయకులు జింకా చంద్రశేఖర్‌, సాకే ఓబిలేసు, అంగజాల రాజు, అర్చకులు శ్రీధర్‌, శ్రీవత్స, ఆలయ సిబ్బంది రామాంజినేయులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 11:23 PM