ఘనంగా బీడీ కార్మికుల మహాసభ
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:26 AM
స్థానిక ఎన్టీఓ హోంలో సోమవారం ఏపీ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన (సీఐటీయూ) ఆధ్వర్యంలో బీడీ కార్మికుల మహాసభను సోమవారం నిర్వహించారు.
తాడిపత్రి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్టీఓ హోంలో సోమవారం ఏపీ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన (సీఐటీయూ) ఆధ్వర్యంలో బీడీ కార్మికుల మహాసభను సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా రాష్ట్ర కన్వీనర్ ఓబులు, జిల్లా అధ్యక్షులు నాగమణి హాజరయ్యారు. ఓబులు మాట్లాడుతూ పట్టణంలో ఏడు వేలమందికి పైగా కార్మికలుఉ బీడీ పరిశ్రమను నమ్ముకొని పనిచేస్తున్నారని, వారికి కనీస వేతనం కూడా చెల్లించడం లేదని అన్నారు. 1966, 1976 కార్మిక సంక్షేమ చట్టాలను కేంద్రప్రభుత్వం రద్దుచేయడం దారుణమన్నారు. బీడీ కార్మికులకు ఇళ్లస్థలాల కేటాయించాలన్నారు. అనంతరం 10 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జగనమోహనరెడ్డి, నరసింహారెడ్డి, హనుమంతరెడ్డి పాల్గొన్నారు.