ఘనంగా రథోత్సవం
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:15 PM
మండలంలోని 74 ఉడేగోళంలో ఆంజనేయస్వామి రథోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
రాయదుర్గంరూరల్, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): మండలంలోని 74 ఉడేగోళంలో ఆంజనేయస్వామి రథోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి పలు అభిషేకాలు నిర్వహించి.. ప్రత్యేకంగా అలంకరించారు. విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. సాయంత్రం రథోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో ఆలయ కమిటీ, సభ్యులు గ్రామపెద్దలు గురుసిద్ధప్ప, ఓబయ్య, పురుషోత్తం, మహానంది, బసవరాజు పాల్గొన్నారు.