ఘనంగా పుస్తక పరిచయ సభ
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:11 AM
పట్టణంలోని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కల్లూరు ఉమర్ ఫారూఖ్‌ఖాన రచించిన భారతీయ ముస్లిం లెజెండ్స్ పుస్తక పరిచయ సభను బుధవారం నిర్వహించారు
గుంతకల్లుటౌన, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కల్లూరు ఉమర్ ఫారూఖ్‌ఖాన రచించిన భారతీయ ముస్లిం లెజెండ్స్ పుస్తక పరిచయ సభను బుధవారం నిర్వహించారు. జేవీవీ రాష్ట్ర కార్య దర్శి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా గుంతకల్లు జీఆర్పీ ఎస్పీ రాహుల్‌మీనా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ఉమర్ ఫారూఖ్ ఖాన, హనుమంతు, డాక్టర్ మంజూరు, ఎంపీడీఓ నాగభూషణం, న్యాయవాది హేమాద్రి, డాక్టర్ విజయకుమారి, సుధాకర్, ప్రభాకర్, స్వామిదాస్, మోనాలిసా, శివప్రసాద్, రాము, ఓబులేసుకు రాయలసీమ సేవరత్న అవార్డులను అంద జేశారు. కార్యక్రమంలో కళాశాల ఇనచార్జి ప్రిన్సిపాల్ రవిశంకర్ శర్మ, జేవీవీ నాయకులు లక్ష్మీప్రసాద్‌యాదవ్, నీల కంఠ తదితరులు పాల్గొన్నారు.