ఘనంగా ఆంజనేయస్వామి గ్రామోత్సవం
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:02 AM
మండలంలోని బొమ్మక్కపల్లిలో ఆంజనేయస్వామి గ్రామోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
రాయదుర్గంరూరల్, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని బొమ్మక్కపల్లిలో ఆంజనేయస్వామి గ్రామోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ఉదయాన్నే పంచామృతాభిషేకం, కుంకుమార్చన, పుష్పలంకరణ, వసా్త్రలంకరణ అనంతరం ప్రత్యేకపూజలు నిర్వహించారు. సాయంత్రం ఆంజనేయస్వామి చిత్రపటాన్ని ట్రాక్టర్‌లో ఉంచి గ్రామంలో ఊరేగించారు. బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి ఇందులో పాల్గొన్నారు.