పంచాయతీ ఏర్పాటుపై గ్రామసభ
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:04 AM
పాల్తూరు పంచాయతీలోని తమ గ్రామాన్ని విడదీసి పంచాయతీగా ఏర్పాటు చేయాలని గాజుల మల్లాపురం గ్రామస్థులు ఇటీవల డీపీఓకు వినతి పత్రం ఇచ్చారు.
విడపనకల్లు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): పాల్తూరు పంచాయతీలోని తమ గ్రామాన్ని విడదీసి పంచాయతీగా ఏర్పాటు చేయాలని గాజుల మల్లాపురం గ్రామస్థులు ఇటీవల డీపీఓకు వినతి పత్రం ఇచ్చారు. దీంతో జిల్లా అధికారులు ఆదేశాలు మేరకు ఈఓ నాగభూషణం ఆధ్వర్యంలో పా ల్తూరులోని సుంకులమ్మదేవి ఆలయ ప్రాగణంలో ఇరు గ్రామాల ప్రజలతో సోమవారం గ్రామ సభను ఏర్పాటు చేశారు. కలిసే ఉండాలని పాల్తూరు గ్రామస్థులు, విడదీసి గాజుల మల్లాపురాన్ని పంచాయతీగా ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్థులు డిమాండ్ చేశారు. దీంతో అధికారులు విడివిడిగా సంతకా లు సేకరించారు. కలిసేఉండాలని 556 మంది, గాజుల మల్లాపురం ప్ర త్యేక పంచాయతీ కావాలని 208 మంది సం తకాలు చేశారు. ఇరు గ్రామాల వారి తీర్మానాన్ని గ్రామ పెద్దలకు అధికారు లు అందించారు. ఎలాంటి సంఘటన లు జరగకుండా ఉరవకొండ సీఐ మ హానంది., ఎస్‌ఐలు విడపనకల్లు ఖజాహుస్సేన, వజ్రకరూర్ నాగస్వామి, పా ల్తూరు మురాహరిబాబు పాల్గొన్నారు.