గూడ్స్ రైలు బోగీ లింక్ కట్
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:16 AM
పటణ సమీపంలోని పుట్లూరు గేటు వద్ద ఓ గూడ్సు రైలు బోగీ లింక్ గురువారం తెగిపోయింది.
తాడిపత్రి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): పటణ సమీపంలోని పుట్లూరు గేటు వద్ద ఓ గూడ్సు రైలు బోగీ లింక్ గురువారం తెగిపోయింది. రైలు ప్రయాణిస్తున్న సమయంలో లింక్ కట్ కావడంతో రెండు భాగాలుగా విడిపోయి, ముందు భాగం దాదాపు కిలోమీటర్ దూ రం ముందుకు వెళ్లింది. ఆ సమయంలో రైల్వే గేటు వద్ద ఆగిన వాహనదారులు కేకలు వేయడంతో లోకో పైలట్ గమనించి రైలును ఆపారు. మరమ్మతు పనులు చేసిన అనంతరం రైలు తిరిగి వెళ్లిపోయింది. దీనికోసం సుమారు గంట పట్టింది. అప్పటి వరకూ రైల్వే గేటును తెరవకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.