JC ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వండి : జేసీ
ABN , Publish Date - May 28 , 2025 | 11:29 PM
ప్రభుత్వ, ఆర్‌అండ్‌బీ స్థలాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారికి .. ఆ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించే విధంగా ముందుగా నోటీసులు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ ఆర్‌అండ్‌బీ జేఈ వన్నూరుస్వామికి ఆదేశించారు.
కొత్తచెరువు, మే 28(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ఆర్‌అండ్‌బీ స్థలాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారికి .. ఆ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించే విధంగా ముందుగా నోటీసులు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ ఆర్‌అండ్‌బీ జేఈ వన్నూరుస్వామికి ఆదేశించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని పుట్టపర్తి, పెనుకొండ, బుక్కపట్నం రహదారులను ఆర్డీఓ సువర్ణ,తహసీల్దార్ నీలకంఠారెడ్డితో కలిసి పరిశీలించారు. ట్రాఫిక్‌కు ఇబ్బందికరంగా మారిన విగ్రహాలను ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసి అక్కడ గార్డెన ఏర్పాటు చేస్తామని కులసంఘాలకు తెలిపారు. అయితే ముందుగా ఆక్రమణలను తొలగించాలని, తరువాత విగ్రహాలను తామే స్వయంగా తొలగిస్తామని కులసంఘాల నేతలు జేసీకి తెలిపారు. ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ అఽధికారులు సర్వే చేసి.. ఆక్రమణలను గుర్తించి.. వారికి నోటీసులు ఇవ్వాలని సూచించారు. వారు స్వచ్ఛందంగా ఆ ఆక్రమణలను తొలగించుకోవాలని, లేకుంటే వాటిని ఎక్స్‌కవేటర్లతో తామే తొలగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ రాధా, ఎంపీడీఓ నటరాజ్ పాల్గొన్నారు.