Share News

JVV: ఆడపిల్లలకు శాస్త్రీయ అవగాహన అవసరం

ABN , Publish Date - Oct 12 , 2025 | 12:00 AM

ఆడపిల్లలకు శాస్త్రీయ అవగాహన అవసరమని జేవీవీ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్‌ ప్రసూన అన్నారు. శనివారం కురుగుంట బాలికల రెసిడెన్షియల్‌ హైస్కూల్‌ల్లో జన విజ్ఞాన వేదిక మహిళా విభాగం సమత ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు.

JVV: ఆడపిల్లలకు శాస్త్రీయ అవగాహన అవసరం
Book launch scene

అనంతపురంరూరల్‌, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): ఆడపిల్లలకు శాస్త్రీయ అవగాహన అవసరమని జేవీవీ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్‌ ప్రసూన అన్నారు. శనివారం కురుగుంట బాలికల రెసిడెన్షియల్‌ హైస్కూల్‌ల్లో జన విజ్ఞాన వేదిక మహిళా విభాగం సమత ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. ఆడపిల్లలు చిన్న వయసు నుంచే తమపై తాము అవగాహన పెంచుకోవడంతోనే అపోహలు తొలగిపోతాయన్నారు. ఒక కుటుంబం ఎదుగుదల శాస్త్రీయ అవగాహన కలిగిన ఆడపిల్లపైనే ఆధారపడి ఉంటుందన్నారు. అనంతరం ఎదిగే ఆడిపిల్ల ఏమి తెలుసుకోవాలి అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. డాక్టర్‌ నాగజ్యోతి, సమత జిల్లా కన్వీనర్‌ రాధా, ప్రిన్సిపాల్‌ సునీత, నాగరత్న, లక్ష్మి, తిరుపాలు, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2025 | 12:00 AM