గవిమఠం లీజు బకాయిలు రూ. 2.2 కోట్లు
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:47 PM
స్థానిక గవిమఠానికి లీజుదారుల బకాయిలు పేరుకపోయాయి. ఉరవకొండ గవిమఠం స్థలంలో 314 దుకాణాలు ఉన్నాయి. వీటికి సంబంధించి లీజుదారులు రూ.2.22 కోట్లు దాకా బకాయిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఉరవకొండ, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): స్థానిక గవిమఠానికి లీజుదారుల బకాయిలు పేరుకపోయాయి. ఉరవకొండ గవిమఠం స్థలంలో 314 దుకాణాలు ఉన్నాయి. వీటికి సంబంధించి లీజుదారులు రూ.2.22 కోట్లు దాకా బకాయిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 2019లో గవిమఠం స్థలాలను వేలం వేసేందుకు అధికారులు సిద్ధం కాగా లీజుదారులు కొంతమంది కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఐదేళ్ల నుంచి వారు లీజు చెల్లించకపోవడంతో వారి బకాయిలే సుమారు రూ.70 లక్షలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. స్టేను వెకెట్ చేయించడంలోనూ గవిమఠం అధికారులు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. కాగా బకాయిలున్న లీజుదారులకు సోమవారం నుంచి నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. బకాయిదారుల్లో ప్రముఖ వైసీపీ నాయకుడు, దేవదాయశాఖలో పనిచేస్తున్న ఓ ఈఓ కుటుంబ సభ్యులు ఉండడం విశేషం.