ఘనంగా ఇంధన పొదుపు వారోత్సవాలు
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:11 AM
పట్టణంలో ఏపీ విద్యుతశాఖ ఆధ్వర్యంలో సోమవారం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
గుత్తి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): పట్టణంలో ఏపీ విద్యుతశాఖ ఆధ్వర్యంలో సోమవారం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్ధానిక ఎన్టీఆర్ సర్కిల్ నుంచి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యుత వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈఈ పద్మానాఽభపిళ్లై, డీఈ సాయిశంకర్, ఏఈలు మధుసూధనరావు, షఫీ, రాజారావు, రఘు, పాల్గొన్నారు.