ఎడాపెడా విద్యుత కోతలు
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:19 AM
మండలంలో పెడాపెడా విద్యుత కోతలు విధిస్తున్నారు. కరెంటు ఎప్పుడొస్తుందో... ఎప్పుడు పోతుందో.. తెలీక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శెట్టూరు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : మండలంలో పెడాపెడా విద్యుత కోతలు విధిస్తున్నారు. కరెంటు ఎప్పుడొస్తుందో... ఎప్పుడు పోతుందో.. తెలీక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజుల నుంచి అధికారులు పగటిపూట ఎటువంటి సమాచారమూ లేకుండా విద్యుతకోతలు విధిస్తున్నారు.వ్యవసాయ బోరుబావుల కింద సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తాగునీటి కోసం గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వేళల ప్రకారం విద్యుత కోతలు విధించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.