ఆరేళ్లుగా ఉచిత భోజన సౌకర్యం
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:50 PM
స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెలా తొమ్మిదవ తేదీన ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
విడపనకల్లు, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెలా తొమ్మిదవ తేదీన ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం కూడా గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల కోసం మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన గర్భిణులకు వేల్పుమడుగు గ్రామానికి చెందిన అంగడి చెన్నప్ప భోజన సౌకర్యం కల్పించారు. ఇలా ఈయన ఆరు సంవత్సరాలుగా భోజన సౌకర్యం కల్పిస్తున్నారు.