రెండేళ్లుగా ... నిరుపయోగంగా ...
ABN , Publish Date - Sep 19 , 2025 | 11:56 PM
మండలంలోని రాకెట్ల గ్రామంలో రెండేళ్ల క్రితం రూ. 1.70 కోట్లతో పీహెచసీ భవనాన్ని నిర్మించారు. అయితే దాన్ని ప్రారంభించడంపై పాలకులు, అధికారులు దృష్టిసారించకపోవడంతో అది నేటికీ నిరుపయోగంగానే ఉంది
ఉరవకొండ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రాకెట్ల గ్రామంలో రెండేళ్ల క్రితం రూ. 1.70 కోట్లతో పీహెచసీ భవనాన్ని నిర్మించారు. అయితే దాన్ని ప్రారంభించడంపై పాలకులు, అధికారులు దృష్టిసారించకపోవడంతో అది నేటికీ నిరుపయోగంగానే ఉంది. దీంతో ఆ భవనం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. మందుబాబులు అడ్డాగా మారింది. మద్యం మత్తు లో మందుబాబులు ఆసుపత్రి కిటికీలను ధ్వంసం చేశారు. పాత పీహెచసీ భవనంలోనే డాక్టర్లు సి బ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ పాత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో .. తరచూ విష పురుగులు వస్తుండడంతో సిబ్బంది హడలెత్తిపోతున్నారు. వారం క్రితం పీహెచసీలోకి ఏకంగా కొండ చిలువ వచ్చింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన పీహెచసీని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బంది, ప్రజలు కోరుతున్నారు.