త్వరలో ఫుడ్ మైక్రో యూనిట్లు : సెర్ప్
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:53 PM
జిల్లాలో పీఎంఎఫ్‌ఎంఈ (ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ సంస్థల పథకం) కింద 100 ఫుడ్ మైక్రో యూనిట్ల ఏర్పాటు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని సెర్ప్ డైరెక్టర్ పద్మావతి తెలిపారు.
ఉరవకొండ, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పీఎంఎఫ్‌ఎంఈ (ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ సంస్థల పథకం) కింద 100 ఫుడ్ మైక్రో యూనిట్ల ఏర్పాటు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని సెర్ప్ డైరెక్టర్ పద్మావతి తెలిపారు. గొర్రెలు, పొట్టేలు, మీట్ ప్రాసెసింగ్‌పై రైతులకు, మహిళా సంఘాల సభ్యులకు స్థానిక వెలుగు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ఈ ఫుడ్ మైక్రో యూనిట్లతో పాటు గార్మెంట్స్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టైలరింగ్ నేర్చుకున్న మహిళలకు మరింత నైపుణ్యంపై, చేనేత మహిళలకు మగ్గాలు, వాటి మరమ్మతులపై శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శైలజ, ప్రాజెక్టు ఎగ్జిక్యూటర్ రాజశ్రీ, మూర్తి, వెటర్నరీ ఏడీఏ పెద్దన్న, ఏసీ శివకుమార్ టీడీపీ నాయకులు విజయ్‌భాస్కర్, గోవిందు, వెంకటేష్ పాల్గొన్నారు