ఇళ్లు, స్థలాల కోసం దరఖాస్తుల వెల్లువ
ABN , Publish Date - Nov 25 , 2025 | 01:17 AM
ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం ఒక్కరోజులోనే ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి.
యాడికి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం ఒక్కరోజులోనే ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. 115మంది లబ్ధిదారులు సోమవారం దరఖాస్తులు అందజేసినట్లు హౌసింగ్ ఏఈ లోకే్‌షకుమార్ తెలిపారు. ఇళ్లు, ఇంటిస్థలాల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని శనివారం అధికారులు వెల్లడించారు. దీంతో సోమవారం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఎంపీడీఓ కార్యాలయంలో క్యూ కట్టారు. దళారులను నమ్మి ఎవరూ మోసపోవద్దని, అర్హులైన వారికి కచ్చితంగా లబ్ధి చేకూరుతుందని అధికారులు అధికారులు తెలిపారు.