చెకుముకి పోస్టర్ ఆవిష్కరణ
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:47 PM
స్థానిక అర్‌అండ్‌బీ బంగ్లా వద్ద జేవీవీ ఆధ్వర్యంలో చెకుముకి సైన్స సంబరాలు పోస్టర్‌ను జేవీవీ మండల ప్రధాన కార్యదర్శి టరంగనాథ్, నాయకులు శనివారం ఆవిష్కరించారు.
గుత్తి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): స్థానిక అర్‌అండ్‌బీ బంగ్లా వద్ద జేవీవీ ఆధ్వర్యంలో చెకుముకి సైన్స సంబరాలు పోస్టర్‌ను జేవీవీ మండల ప్రధాన కార్యదర్శి టరంగనాథ్, నాయకులు శనివారం ఆవిష్కరించారు. రంగనాథ్ మాట్లాడుతూ.. ఈనెల 18న పాఠశాలస్థాయి, నవంబరు 1న మండలస్థాయి, 23న జిల్లాస్థాయిలో చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరెడ్డి, జేవీవీ నాయకులు డానియేల్, శ్రీధర్‌గౌడ్, రామచంద్ర,వెంకటరామిరెడ్డి, రవికుమార్ పాల్గొన్నారు.