దుకాణంలో అగ్నిప్రమాదం - రూ. కోటి నష్టం
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:57 PM
పట్టణ సమీపంలోని కడప రహదారిలో ఫర్నీచర్ మ్యానుఫ్యాక్టరింగ్ దుకాణంలో సోమవారం రాత్రి షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది
తాడిపత్రి, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): పట్టణ సమీపంలోని కడప రహదారిలో ఫర్నీచర్ మ్యానుఫ్యాక్టరింగ్ దుకాణంలో సోమవారం రాత్రి షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణంలో యుపీవీసీ విండోస్ ఫర్నీచర్ తదితర సామగ్రి, వస్తువులు, మిషనరీ పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు రూ. కోటి ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు మోహనాచారి వాపోయారు.