Share News

Finance Minister సాస్కీ నిధులను వాడుకోండి

ABN , Publish Date - Dec 13 , 2025 | 12:52 AM

సాస్కీ (స్పెషల్‌ అసిస్టెన్స టూ స్టేట్స్‌ ఫర్‌ కేపిటల్‌ ఇన్వె్‌స్టమెంట్‌) స్కీమ్‌ ద్వారా జిల్లాకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి పయ్యావుల కేశవ్‌ పీఆర్‌ ఎస్‌ఈ చిన్న సుబ్బరాయుడును ఆదేశించారు.

Finance Minister సాస్కీ నిధులను వాడుకోండి
పీఆర్‌ ఎస్‌ఈతో చర్చిస్తున్న మంత్రి పయ్యావుల కేశవ్‌

ఆర్థిక శాఖమంత్రి పయ్యావుల కేశవ్‌

అనంతపురం న్యూటౌన, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): సాస్కీ (స్పెషల్‌ అసిస్టెన్స టూ స్టేట్స్‌ ఫర్‌ కేపిటల్‌ ఇన్వె్‌స్టమెంట్‌) స్కీమ్‌ ద్వారా జిల్లాకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి పయ్యావుల కేశవ్‌ పీఆర్‌ ఎస్‌ఈ చిన్న సుబ్బరాయుడును ఆదేశించారు. ఈ నిధులతో జిల్లాలో ఎక్కడా గుంతలు రోడ్లు లేకుండా చూడాలన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో శుక్రవారం సాస్కీ స్కీమ్‌పై పీఆర్‌ ఎస్‌ఈతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. సాస్కీ స్కీమ్‌ ద్వారా జిల్లాకు రూ.85 కోట్లు వచ్చాయని ఎస్‌ఈ తెలిపారు. ఉరవకొండ నియోజవర్గంలో బీటీ రోడ్ల అభివృద్ధికి ఈ నిధుల్లో కొంత వినియోగిస్తామని మంత్రికి వివరించినట్లు ఎస్‌ఈ తెలిపారు. అలాగే నియోజకవర్గంలో 58.51 కిలోమీటర్లలో బీటీ రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చుడతామన్నారు.

Updated Date - Dec 13 , 2025 | 12:52 AM