రోడ్డుపై గుంతలు పూడ్చివేత
ABN , Publish Date - Sep 15 , 2025 | 12:05 AM
శెట్టూరు నుంచి కళ్యాణదుర్గం వెళ్లే ప్రధాన రహదారిపై గుంతలు పడటంతో.. ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
శెట్టూరు, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి) : శెట్టూరు నుంచి కళ్యాణదుర్గం వెళ్లే ప్రధాన రహదారిపై గుంతలు పడటంతో.. ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇది గమనించిన హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు నవీన, మహేష్, బాలరాజ్, సురేష్, సత్యనారాయణ ఆదివారం శ్రమదానం చేశారు. రోడ్డుపై ఉన్న గుంతలను సిమెంటు, కంకరతో కలిపి పూడ్చి వేశారు. వీరిని ప్రయాణికులు అభినందించారు.