హోరాహోరీగా డివిజనల్‌స్థాయి పోటీలు
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:35 AM
స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో విద్యార్థులకు డివిజనల్ స్థాయి క్రీడా పోటీలను గురువారం నిర్వహించారు.
ఉరవకొండ, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో విద్యార్థులకు డివిజనల్ స్థాయి క్రీడా పోటీలను గురువారం నిర్వహించారు. షటిల్, బ్యాడ్మింటన, ఖో-ఖో, యోగాలో అండర్-14, 17 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. విజేతలకు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. ఇందులో డివిజనల్ లెవల్ కోఆర్డినేటర్ నాగరాజు, ఎంఈఓలు ఈశ్వరయ్య, రమాదేవి, హెచఎం సత్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.