సిద్దలాపురంలో ఫీడర్ ప్రారంభం
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:38 AM
ఆత్మకూరు మండలం సిద్దలాపురం సబ్‌స్టేషనలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫీడర్‌ను విద్యుతశాఖ అధికారులు శుక్రవారం ప్రారంభించారు.
కూడేరు, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు మండలం సిద్దలాపురం సబ్‌స్టేషనలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫీడర్‌ను విద్యుతశాఖ అధికారులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సబ్‌స్టేషన నుంచి కూడేరు మండలంలోని ఎంఎంహళ్లి గ్రామంతో పాటు తోటలకు విద్యుత సరఫరా సరఫరా అయ్యేది. విద్యుత ఓవర్‌లోడు సమస్యతో ఎంఎంహళ్లి గ్రామస్థులు ఇబ్బందులు పడేవారు. దీంతో స్థానికులు, రైతులు ఈ సమస్యను మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి ఆదేశాల మేరకు దాదాపు రూ.36 లక్షలతో నూతన విద్యుత లైనతోపాటు సిద్దలాపురం సబ్‌స్టేషనలో ఫీడర్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. దీన్ని శుక్రవారం ప్రారంభించడంతో విద్యుత సమస్య పరిష్కరించినట్లైంది. కార్యక్రమంలో విద్యుత శాఖ డీఈ రమేస్, ఏడీ రవిశంకర్, కూడేరు ఏఈ గౌస్‌మెద్దీన, ఆత్మకూరు ఏఈ బండి దాస్ పాల్గొన్నారు.