Share News

భయం.. భయంగా బడి

ABN , Publish Date - Dec 11 , 2025 | 12:41 AM

వజ్రకరూరు మండలం కొత్త కడమలకుంటలో పాఠశాలలో 1వ నుంచి 5వ తరగతి వరకూ 25 మంది విద్యార్థులు న్నారు. ఆ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పెచ్చులూడి పడుతున్నాయి. ఇనుపకడ్డీలు కనిపిస్తున్నాయి. ఇటీవల పెచ్చులూడి ఉపాధ్యాయుడిపై మీద పడ్డాయి.

భయం.. భయంగా  బడి
పెచ్చులూడిన భవనం

వజ్రకరూరు (ఉరవకొండ), డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): వజ్రకరూరు మండలం కొత్త కడమలకుంటలో పాఠశాలలో 1వ నుంచి 5వ తరగతి వరకూ 25 మంది విద్యార్థులు న్నారు. ఆ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పెచ్చులూడి పడుతున్నాయి. ఇనుపకడ్డీలు కనిపిస్తున్నాయి. ఇటీవల పెచ్చులూడి ఉపాధ్యాయుడిపై మీద పడ్డాయి. దీంతో విద్యార్థులకు వరండాలో తరగతులను నిర్వహిస్తున్నారు. ఆ వరండా పరిస్థితీ అంతంతే. వర్షాల కాలం వస్తే పరిస్థితి మరీ దారుణం. అధికారులు స్పందించి మరమ్మ తులు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది కోరుతున్నారు. దీనిపై ఎంఈవో ఎర్రిస్వామిని వివరణ కోరగా మరమ్మతులకు సంబంధించి ప్రతిపాదనలు ఉన్నతా ధికారులకు పంపామని, నిధులు మంజూరు కాగానే పనులు చేపడతామని తెలిపారు.

Updated Date - Dec 11 , 2025 | 12:41 AM