rdt ఘనంగా ఫాదర్ ఫెర్రర్ జయంతి
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:32 AM
ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ వినసెంట్ ఫెర్రర్ 105వ జయంతి సందర్భంగా బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆసుపత్రిలోని ఫాదర్ ఘాట్ వద్ద ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ అన్నె ఫెర్రర్ బుధవారం ఘనంగా నివాళులర్పించారు.
బత్తలపల్లి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ వినసెంట్ ఫెర్రర్ 105వ జయంతి సందర్భంగా బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆసుపత్రిలోని ఫాదర్ ఘాట్ వద్ద ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ అన్నె ఫెర్రర్ బుధవారం ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్డీ ప్రమీల, నిర్వహణ మేనేజర్ హనుమంతరెడ్డి పాల్గొన్నారు.
ధర్మవరంరూరల్: ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ ఫెర్రర్ 105వ జయంతి వేడుకలను మండలంలోని గొట్లూరు, రేగాటిపల్లి, నేలకోటతండాతో పాటు పలుగ్రామాల్లో బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్డీటీ బత్తలపల్లి ఆసుపత్రి ప్రతినిధి శర్మ, అనంతపురం ఆర్డీటీ ప్రధానకార్యాలయ ప్రతినిధి ప్రసన్న హాజరయ్యారు. పలు గ్రామాల్లో ఆర్డీటీ సంస్థ మహిళ సంఘాలు ఏర్పాటు చేసిన హుండీలను పగలగొట్టి ఆ డబ్బును విరాళంగా ఇచ్చారు.
కదిరి: నల్లచెరువులోని జిల్లాపరిషత ఉన్నత పాఠశాలలో ఫెర్రర్ జయంతిని వినాయక వికలాంగుల సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో వికలాంగుల సంఘం అధ్యక్షుడు నాగరాజు, రెడ్డెప్ప, ఎస్ రెడ్డెప్ప, గణేష్ పాల్గొన్నారు.