రైతుల సంక్షేమమే టీడీపీ ధ్యేయం: ఎమ్మెల్యే
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:30 AM
రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వ ధ్యేయమని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ప్రభుత్వం అందించిన సబ్సిడీ వ్యవసాయ డ్రోనను మంగళవారం ఆయన ప్రారంభించారు.
యాడికి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వ ధ్యేయమని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ప్రభుత్వం అందించిన సబ్సిడీ వ్యవసాయ డ్రోనను మంగళవారం ఆయన ప్రారంభించారు. డ్రోన పనితీరును లబ్ధిదారుడు పరిమి చరణ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రూ.10 లక్షలు విలువగల వ్యవసాయ డ్రోనను రైతు వాటా రూ.2లక్షలు, ప్రభుత్వ సబ్సిడీ రూ.8 లక్షలతో ప్రభుత్వం అందిస్తోందన్నారు. డ్రోన ద్వారా పంటలకు మందులను పిచికారి చేసుకోవచ్చన్నారు. డ్రోన వాడకం ద్వారా మందులు, సమయం ఆదా అవుతాయన్నారు. రైతులు డ్రోన్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెంట ఏఓ మహబూబ్‌బాషా, యాడికి, వేములపాడు సింగిల్‌విండో చైర్మన్లు చలమారెడ్డి, నాగమునిరెడ్డి, మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, టీడీపీ మండల కన్వీనర్ రుద్రమనాయుడు, మాజీ ఎంపీటీసీ ఆదినారాయణ, నాయకులు రవికుమార్‌రెడ్డి, మాదాల అనిల్, బయపురెడ్డి, విశ్వనాథ్ ఉన్నారు.