Share News

రైల్వేలో సదుపాయాలు మెరుగుపడాలి: దక్షిణ మధ్య రైల్వే జీఎం

ABN , Publish Date - Aug 21 , 2025 | 12:15 AM

రైల్వే పరిధిలో ప్రజా సదుపాయాలు, ట్రాఫిక్‌ సౌకర్యాలు, పరిశుభ్రతా ప్రమాణాలు కా లానుగుణంగా మెరుగుపడాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం సం జయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ సూచించారు. ఆయన బుధవారం ఉ దయం నుంచీ రాత్రి వరకూ గుంతకల్లు రైల్వే డివిజనలో పర్యటించారు.

రైల్వేలో సదుపాయాలు మెరుగుపడాలి: దక్షిణ మధ్య రైల్వే జీఎం

గుంతకల్లు, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): రైల్వే పరిధిలో ప్రజా సదుపాయాలు, ట్రాఫిక్‌ సౌకర్యాలు, పరిశుభ్రతా ప్రమాణాలు కా లానుగుణంగా మెరుగుపడాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం సం జయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ సూచించారు. ఆయన బుధవారం ఉ దయం నుంచీ రాత్రి వరకూ గుంతకల్లు రైల్వే డివిజనలో పర్యటించారు. సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైలులో వచ్చిన జీఎం తొలుత తిరుపతి, రేణిగుంట రైల్వే జంక్షన్లలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. తిరుపతిలో అమృత భారత స్టేషన పథకం కింద చేపడుతున్న పనులను సందర్శించారు. అభివృద్ధి పనుల విషయంగా గుంతకల్లు రైల్వే డివిజనల్‌ అధికారులతో చర్చించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కడప స్టేషనలో జరుగుతున్న కనస్ట్రక్షన వర్కులను తనిఖీ చేశారు. పర్యటనలో తిరుపతి నుంచి గుంతకల్లు వరకూ ప్రత్యేక రైలులో ట్రాక్‌, రైలు వంతెనల ప్రమాణాలను రీర్‌ విండోలో తనిఖీ చేశారు. సా యంత్రం గుంతకల్లుకు చేరుకుని స్థాని డీఆర్‌ఎం కార్యాలయంలో డీఆర్‌ఎం చంద్రశేఖర్‌ గుప్తా, వివిధ విభాగాల ఇనచార్జి అధికారులతో డివిజనలో చేపడుతున్న అభివృద్ధి పనులు, వివిధ ప్రాజెక్టు లు, స్టేషన్ల పునర్నిర్మాణ పనులు, ట్రాఫిక్‌ సదుపాయాలు, తదిత ర అంశాలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ డీఆర్‌ఎం సంతో్‌షకుమార్‌ వర్మ, జోనల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 12:15 AM