Share News

MLA అభివృద్ధిని ప్రజలకు వివరించండి

ABN , Publish Date - May 05 , 2025 | 11:43 PM

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

 MLA అభివృద్ధిని ప్రజలకు వివరించండి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కందికుంట

కదిరి, మే 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. సోమవారం నల్లచెరువులోని గీతామందిరంలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంతో ఆయన మాట్లాడారు. ప్రతి నెలా మండల కార్యకర్తల సమావేశం నిర్వహించి.. సమస్యలు చర్చించుకోవాలన్నారు. నీటి ఎద్దడి, ఇతర సమస్యలను కార్యకర్తలు నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో మైనార్టీ నా యకురాలు ఫర్వీనాభాను, నాయకులు దాదెం శివారెడ్డి, నాగభూషణం నాయుడు, ఖాదర్‌, మాబూసాబ్‌, వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2025 | 11:43 PM