ఉత్సాహంగా డ్యాన్స పోటీలు
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:48 PM
స్థానిక రామస్వామివీధిలో ఫ్రెండ్స్ టూ హెల్ప్ ఆధ్వర్యంలో 25 సంవత్సరాలుగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు.
గుంతకల్లుటౌన, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): స్థానిక రామస్వామివీధిలో ఫ్రెండ్స్ టూ హెల్ప్ ఆధ్వర్యంలో 25 సంవత్సరాలుగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన డ్యాన్స పోటీల్లో 250 మంది పాల్గొన్నారు. పోటీల్లో విజేతలకు 2018 ఢీ చాంపియన మణికంఠ, టీడీపీ కౌన్సిలర్ ఆర్‌పవనకుమార్ గౌడ్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఇందులో నిర్వాహకులు ఆర్ రామ్‌తేజ్‌గౌడ్, బీకే మధు, అవినాష్, వెంకటేష్, గురు, పోలాపవన, సుదీర్, శ్యామ్, ప్రసాద్ పాల్గొన్నారు.