హెచ్చెల్సీ పక్కనే తవ్వకాలు
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:48 PM
మండల సరిహద్దులోని తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) పక్కనే కర్ణాటక పరిధిలో మట్టి తవ్వకాలు చేపడుతుండడం మండల రైతుల్లో అందోళన రేపుతోంది
బొమ్మనహాళ్, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): మండల సరిహద్దులోని తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) పక్కనే కర్ణాటక పరిధిలో మట్టి తవ్వకాలు చేపడుతుండడం మండల రైతుల్లో అందోళన రేపుతోంది. కాలువ అనంత భాగంలో ఉండగా, తవ్వకం మాత్రం అవతల రాష్ట్రంలో చేపడుతున్నారు. యంత్రాలతో కాలువకు కొన్ని అడుగుల దూరంలో తవ్వుతున్నారు. తద్వారా కాలువ బలహీనపడే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. అయినా.. హెచ్చెల్సీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కర్ణాటక అధికారులు కాలువ పక్కనే తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే తవ్వకాలను నిలిపివేసి కాలువ పటిష్టతకు చర్యలు తీసుకోకపోతే పెద్ద ప్రమాదం తప్పదని రైతులు అంటున్నారు.